విజయవాడలో నిర్వహించిన ఇసుకదీక్షలో టీడీపీ అధినేత చంద్రబాబు.. సీఎం జగన్ తిరుమలకు వెళితే సంతకం పెడతాడా అంటూ వ్యక్తిగత విమర్శలు చేసిన సంగతి తెలిసిందే..ఇక వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారంటూ టీడీపీ చార్జిషీట్ రిలీజ్ చేసిందని బాబు చెప్పుకున్నాడు. చంద్రబాబు విమర్శలపై వైసీపీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. తాజాగా మీడియాతో మాట్లాడిన కొడాలి నాని చంద్రబాబుపై చెలరేగిపోయాడు. బాబు చెప్పేవన్నీ దొంగమాటలు..సంక్షోభం నుంచి ఆయనేదో వెతుక్కుంటా అని చెబుతాడు.. శవాల మీద పేలాలు ఏరుకున్న మొహం వేసుకుని ఇసుకదీక్ష అంటాడు.అంతకు ముందు మోదీగారిని దించేస్తాను..ప్రజాస్వామ్యం ప్రొక్లెయిన్‌లోకి వెళ్లిపోయిందంటూ..ఇట్లాగే 12 గంటలపాటు ధర్మపోరాట దీక్షలు 13 జిల్లాలలో చేశాడు.. ఢిల్లీకి వెళ్లి కూడా రూ. 10 కోట్లు ఖర్చుపెట్టి చేశాడు..జనం లాగి గూబమీద కొడితే..మళ్లీ ఇక్కడకు వచ్చి కూర్చుని ఎవడి కాళ్లు పట్టుకుందామా..మోదీ అపాయింట్‌మెంట్ కావాలి..అమిత్‌షా అపాయింట్‌మెంట్ కావాలి…ఆఖరికి కన్నా లక్ష్మీ నారాయణ అపాయింట్‌మెంట్ ఇచ్చినా వెళ్లేటటువంటి దౌర్భాగ్య పరిస్థితిలోకి దిగజారిపోయాడని కొడాలి నాని ఎద్దేవా చేశారు.
ఇసుక దీక్షలో డయాస్ మీద అడ్డమైన వాళ్లను పెట్టి పిచ్చవాగుడు, పిచ్చమాటలు..మాట్లాడుతూ..మా ప్రభుత్వాన్ని తిట్టించాడని చంద్రబాబుపై నాని మండిపడ్డారు. అసలు జగన్‌మోహన్ రెడ్డి హిందువా, ముస్లిమా, క్రిస్టియనా..ఇవన్నీ మీకెందుకుని నాని ప్రశ్నించారు. 151 సీట్లు కట్టబెట్టి జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రజలు తీర్పు ఇస్తే..తిరుపతిలో సంతకం పెట్టావా అంటారు.. ఈ రాష్ట్రంలో పుట్టిన పౌరుడిగా జగన్‌మోహన్ రెడ్డి గారికి ఏ గుడిలోనైనా, మసీదైనా, చర్చికైనా వెళ్లే హక్కు ఉంది..ఎవరికి సంతకం పెట్టాలి..ఎవరికి డిక్లరేషన్ ఇవ్వాలని నాని ప్రశ్నించారు. రేపు మాపో ప్రతిపక్ష హోదా పోయే చంద్రబాబును వాళ్ల ఎమ్మెల్యే వల్లభనేని వంశీనే బూతులు తిట్టాడు..ప్రభుత్వం వచ్చి 5 నెలలు కాకముందే..ఏంటీ గబ్బు వ్యవహారాలు…నువ్వు ఇంకా బుద్ధి తెచ్చుకోలేదంటూ వంశీ బయటకు వచ్చారని నాని అన్నారు. పార్టీని రిపేర్ చేసుకోకుండా సిగ్గూ, శరం లేకుండా జగన్‌మోహన్ రెడ్డి మీద కులాలు, మతాల పేరుతో నిందలు మోపుతున్నారని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంగ్లీష్ మీడియంపై టీడీపీ విమర్శలకు స్పందిస్తూ..చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్‌ను ఏ మీడియంలో చదివించాడు..ఇప్పుడు మనవడిని ఏమీడియంలో చదివిస్తున్నాడు..ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్, విజయవాడలో నిర్వహిస్తున్న స్కూళ్లను ఏ మీడియంలో నడుపుతున్నారని, నాని ప్రశ్నించారు. వైసీపీ నేతలు ఆంబోతుల్లాగా పవన్ కల్యాణ్‌పై దాడి చేస్తున్నామని చంద్రబాబు అంటున్నాడు..మేము ఆంబోతులం అయితే..నువ్వేంటి చంద్రబాబు కుక్కవా.. కుక్కలాగా..మొరుగుతున్నావా..నక్కలాగా దొంగనాటకాలు ఆడుతున్నావా..మామను వెన్నుపోటు పొడిచావు..పార్టీని దొంగిలించావు..ఎన్టీఆర్ చావుకు కారకుడివి అయ్యావు అని నాని ఫైర్ అయ్యారు. చార్జిషీట్ అంటాడు..ఈయనేమేనా పోలీసా…కనీసం చంద్రబాబు నాయుడు కానిస్టేబుల్ కూడ కాదు..వీడెవడు చార్జిషీట్ వేయడానికి మామీద అంటూ నాని పరుషవ్యాఖ్యలు చేశారు. నువ్వో 420, ఒక దొంగ..ఇసుక అక్రమార్కుల చేతికి పోకుండా ఆదాయం ప్రభుత్వానికి రావాలని జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని మా ప్రభుత్వం కృషి చేస్తుంటే..తిన్న ఇసుక చాలక నిన్న ఇసుక దీక్ష అని ఓ ఇసుక బ్యాగ్ మెడలో వేసుకుని కూర్చున్నాడు అని నాని మండిపడ్డారు. ఇసుక దొంగతనం చేస్తున్నామని మామీద చార్జిషీట్ వేస్తావా..నువ్వెవడివి చార్జీషీట్ వేయడానికి…నీకులాగా ఇసుకో, మట్టో, చెత్తా చెదారమో తినాల్సిన ఖర్మ వైసీపీ నాయకులకు లేదని నాని బాబుపై ఫైర్ అయ్యారు..చంద్రబాబు నాయుడు నీకు 70 ఏళ్లు వచ్చాయి..ఎన్ని తిట్టినా కూడా సిగ్గూ, శరం లేదు…అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పది జన్మలెత్తినా ఈ రాష్ట్రానికి మళ్లీ నీకు ముఖ్యమంత్రి కాలేవు..తెలంగాణలోగా..ఇక్కడ కూడా నీ పార్టీ మట్టికొట్టుకుని పోతుందంటూ.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా చంద్రబాబుపై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయవర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి.