ఏపీ అధికార వైసీపీ సీనియర్ నేత,మంత్రి కొడాలి నాని మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. ఆయన మాట్లాడుతూ” పిల్లనిచ్చి పెళ్ళి చేయడమేకాకుండా రాజకీయ భవిష్యత్ నిచ్చిన టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత ఎన్టీ రామారావును చివరి రోజుల్లో ఎలా అయితే మానసికంగా హింసించి వేధించి ఆయన మృతికి కారణమయ్యారో అదే గతి చంద్రబాబుకు పడుతుందని హెచ్చరించారు. మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ” లోకేశ్ వలనే టీడీపీ సర్వనాశనమైంది. టీడీపీనే మా పార్టీ స్టోర్ రూం లో పెట్టిస్తానని అన్నారు. ఇసుక ,ఇంగ్లీష్ తప్పా టీడీపీ దగ్గర మాట్లాడానికి ఏమి లేదని”ఆయన విరుచుకుపడ్డారు.