తిరుపతి, శ్రీశైలం, విజయవాడ ఐ ల్యాండ్‌లో అన్యమత ప్రచారం జరిగినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. ప్రచారం కోసమే తప్పుడు ప్రకటనలు చేస్తున్నారు. మతాలను అడ్డు పెట్టుకుని నీచమైన రాజకీయం చేస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. వాస్తవానికి రాష్ట్రంలో ఎక్కడ మత ప్రచారం జరగడం లేదు ఎవరి మతం వాళ్ళు ఎవరి ఇష్టదైవాన్ని వాళ్లు పూజించుకుంటున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనకు సంబంధించి ఏ విధమైన లోటుపాట్లు అవినీతి ఆరోపణలు లేకపోవడంతో ప్రతిపక్ష టీడీపీ జనసేన ఇష్టానుసారంగా కులం మతం అంటూ జగన్ పై ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పిస్తోంది. పాలనాపరమైన విమర్శలు చేయడానికి సరైన ఆధారాలు లేకపోవడంతో మతపరమైన అంశాలు లేవనెత్తి విధ్వంసాలు సృష్టిస్తే బిజెపి కూడా అందుకు వంత పాడుతుందనే నమ్మకంతో టిడిపి అన్యమత ప్రచారం అంటూ ఎక్కడికక్కడ తమకున్న సోషల్ మీడియా శ్రేణులతో దుష్ప్రచారం చేయిస్తోంది. గతంలో ఇలాగే గ్రామ సెక్రటేరియట్ లో అన్యమత ప్రచారం క్రైస్తవుల ప్రార్ధనలు జరిగాయంటూ ప్రచారం చేసి ఇ అవి నిజం కాదని తేలిన తర్వాత బిజెపి టిడిపి శ్రేణులు కనీసం కిమ్మనలేదు.