హెబ్బా పటేల్ అప్పుడేప్పుడో విడుదలైన కుమారి 21ఎఫ్,అంధగాడు,ఈడోరకం ఆడోరకం లాంటి చిత్రాల్లో నటించి ఇటు అందంతో అటు చక్కని అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకున్న అందాల రాక్షసి. ఆ తర్వాత నటించిన చిత్రాల్లో సరైన హిట్స్ లేకపోవడంతో అమ్మడు కొద్ది రోజులు మేకప్ కు దూరంగా ఉన్నారు. తాజాగా యువహీరోతో రోమాన్స్ చేయడానికి సిద్ధమవుతుంది ఈ ముద్దుగుమ్మ .
గతంలో తనకు హిట్ అందించిన మూడు సినిమాల్లో తనకు జోడిగా నటించిన రాజ్ తరుణ్ సరసన నటించనున్నది. ప్రస్తుతం రాజ్ తరుణ్ ,మాలవికానాయర్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ఒరేయ్ బుజ్జిగా. కొండా విజయ్ కుమార్ దర్శకుడు.
శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కెకె రాధామోహాన్ నిర్మిస్తున్నారు. ఈ మూవీలోనే అమ్మడు కీలకపాత్రలో నటించనున్నారు అని చిత్రం యూనిట్ తెలిపింది. నిన్న శుక్రవారం ఈ చిత్రం షూటింగ్ లో ఈ ముద్దుగుమ్మ పాల్గొన్నది. వాణివిశ్వనాథ్,నరేష్,పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీకి అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్నాడు.