తెలంగాణ రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్,గంగుల కమలాకర్ ఉమ్మడి మెదక్ ,కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రులు తలసాని ,గంగుల కమలాకర్ లోయర్ మానేరు డ్యామ్ జలాశయంలో జలకంఠ రకమైన రొయ్య విత్తనాలను వదిలారు. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ” తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం మత్స్య సంపద పెంపొందించేందుకు అనేక కార్యక్రమాలను తీసుకొచ్చింది. మత్స్యకారులకు ఉచిత చేప పిల్లలను పంపిణీ చేసింది. మూడేళ్లుగా ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా మత్స్య కారులకు చాలా లబ్ధి జరుగుతుంది “అని అన్నారు.ఆయన ఇంకా మాట్లాడుతూ” ముదిరాజులు,గంగపుత్రులు ఐకమత్యంగా ఉంటేనే ప్రభుత్వ పథకాలను లబ్ధి పొందుతారు. త్వరలోనే మత్స్యపారిశ్రామిక సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు. కావున సోసైటీలో సభ్యులను నమోదు చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు రూ.61కోట్ల విలువైన చేప విత్తనాలను ఉచితంగా పంపిణీ చేశాము. మత్స్య కారులకు డెబ్బై శాతం రాయితీతో సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నాము అని అన్నారు.
