పునర్నవి భూపాలం. ‘ఉయ్యాల జంపాల’ సినిమాలో కూల్‌గా, క్యూట్‌గా ముద్దుముద్దు పలుకులతో ఆకట్టుకున్న ఈ తార, హీరోయిన్‌గానూ పలు అవకాశాలను అందిపుచ్చుకుంది. ఇటీవలే బిగ్ బాస్–3 కంటెస్టెంట్‌గా పాపులరైంది. హౌస్‌లో లేడీ మోనార్క్‌గా పేరు తెచ్చుకున్న పున్ను బ్యూటీ..తన అందం, అభినయంతో అదరగొట్టింది. బిగ్ బాస్ షో ద్వారా మరింత పాపులారిటీ రావడంతో పునర్నవికి సినిమాల్లో అవకాశాలు పెరుగుతున్నాయి. ఇప్పుడు హీరోయిన్‌గా మరో సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈమె హీరోయిన్‌గా ‘సైకిల్’ సినిమా చేసింది. మహత్ రాఘవేంద్ర డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ఆట్ల అర్జున్ రెడ్డి డైరెక్ట్ చేసాడు. ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ విడుదల చేసాడు. ఈ టీజర్‌లో దురదృష్ణవంతుడిని లాటరీనీ.. అదృష్టవంతుడు జాతకాన్ని అసలు నమ్మకూడదు అంటూ సాగే టీజర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ప్యూర్ లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాతో కమెడియన్ సుదర్శన్ కీలక పాత్రలో నటించాడు. మహత్ రాఘవేంద్ర గతంలో ‘బ్యాక్ బెంచ్ స్టూడెంట్’ సినిమాలో నటించాడు. ఆ తర్వాత కొన్ని తమిళ సినిమాల్లో అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. మరి ఈ సినిమాతో హీరోయిన్‌గా పునర్నవి కథానాయికగా తన సత్తా చాటుతుందా లేదా అనేది చూడాలి.
