కాంగ్రెస్ పార్టీ జాతీయ తాత్కాలిక అధ్యక్షురాలు,యూపీఏ చైర్ పర్షన్ సోనియా గాంధీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ చాలా విషయాల్లో మౌనంగా ఉన్న సంగతి విదితమే. ఆ తర్వాత జరిగిన పలు రాష్ట్రాల సార్వత్రిక ఎన్నికల్లో ఒకటి రెండు చోట్ల తప్పా అన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయం పాలైన నేపథ్యంలో తాజాగా సోనియా గాంధీ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా దేశంలో ప్రస్తుతం ప్రజలు ఎదుర్కుంటున్న ఆర్థిక మాంద్యం,కేంద్ర ప్రభుత్వం వ్యవహారిస్తున్న పలు వ్యతిరేక విధానాలకు నిరసనగా పలు కార్యక్రమాలు.. ఉద్యమాలు.. ధర్నాలు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగానే ఈ నెల ముప్పై తారీఖున దేశ రాజధాని ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో సోనియా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరగనున్నది. ఆ తర్వాత భారీ బహిరంగ సభ జరగనున్నది. ఈ మేరకు సోనియా నివాసంలో సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నారు.