ఏలూరు జిల్లా జైలు నుంచి టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విడుదలయ్యారు. ఆయనకు నిన్న కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. 67 రోజుల పాటు చింతమనేని జైల్లో ఉన్నారు. పలు కేసుల్లో ఆయన నిందితుడిగా ఉన్నారు. ఇప్పటికే ఆయనకు 14 కేసుల్లో బెయిల్ రాగా.. నిన్న నాలుగు కేసుల్లో బెయిల్ మంజూరు అయింది. ఈ ఏడాది ఆగస్టు 29న పెదవేగి మండలం పినకడిమికి చెందిన చెరుకు జోసెఫ్ పై దాడి చేసి కులం పేరుతో దూషించారన్న అభియోగంతో పెదపాడు పోలీస్ స్టేషన్ లో చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. మరోవైపు, చింతమనేని విడుదలైన తర్వాత భారీ ర్యాలీ నిర్వహించాలని ఆయన అభిమానులు ప్లాన్ చేశారు. దీనికి సంబంధించి పోస్టర్లు కూడా వేశారు. అయితే, పోలీసులు వాటిని తీయించేశారు. ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. మరో పక్క మళ్లీ ఎదో కేసుల్లో జైలుకి వెళాతాడు అంటూ సోషల్ మీడియాలో సెటైర్ల్ వేస్తున్నారు. చూడాలి మరి జైలు నుంచి వచ్చక చింతమనేని ప్రభాకర్ ఏ విధంగా ఉంటాడో .
