చంద్రబాబు గత ఐదేళ్ళ పాలనలో ప్రజలకు చేసింది ఏమీ లేదనే చెప్పాలి. ఎందుకంటే ఏదైనా చేసి ఉంటే ప్రజలు అప్పుల బారిన పడేవారు కాదు మరియు రైతులు ఆత్మాహత్యలు చేసుకునేవారు కూడా కాదు. ఇవన్నీ జరిగాయి అంటే చంద్రబాబు ఎంత గొప్ప పనులు చేసారు అర్ధం చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే చంద్రబాబు లెగ్ అంటే మామోలు విషయం కాదు ఎందుకంటే ఆయన అడుగు పెట్టక ఎలాంటి తుఫాన్లు వచ్చాయో ఏమైందో అందరం చూసాము కూడా. ఈ సందర్భంలోనే బాబూ గారు తుఫాన్లను దారి మళ్లించి, సముద్రాన్ని కంట్రోల్ చేయగల శక్తి నాకుందని చెప్పుకొచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అయితే ఈ విషయంపై స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుకి చురకలు అంటించారు. “ఇసుక సమస్యను ఒక్క రోజులో పరిష్కరించే శక్తి ఉంటే ప్రజల కోసం ఆ పని చేయకుండా ఎవరాపారు చంద్రబాబు గారూ? తుఫాన్లను దారి మళ్లించి, సముద్రాన్ని కంట్రోల్ చేయగల తమకు మాయల ఫకీరు మంత్ర శక్తులున్నాయని అందరికీ తెలుసు. వాటిని చేతబడులకు, శాపనార్థాలకు వాడకుండా ఉపయోగపడే పనులు చేయండి” అని అన్నారు.
ఇసుక సమస్యను ఒక్క రోజులో పరిష్కరించే శక్తి ఉంటే ప్రజల కోసం ఆ పని చేయకుండా ఎవరాపారు @ncbn గారూ? తుఫాన్లను దారి మళ్లించి, సముద్రాన్ని కంట్రోల్ చేయగల తమకు మాయల ఫకీరు మంత్ర శక్తులున్నాయని అందరికీ తెలుసు. వాటిని చేతబడులకు, శాపనార్థాలకు వాడకుండా ఉపయోగపడే పనులు చేయండి.
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 16, 2019