Home / ANDHRAPRADESH / పూర్వ విద్యార్థుల సమ్మేళనం.. ముఖ్య అతిథులుగా సీఎం జగన్ ..టెక్‌ మహీంద్రా సీఈఓ

పూర్వ విద్యార్థుల సమ్మేళనం.. ముఖ్య అతిథులుగా సీఎం జగన్ ..టెక్‌ మహీంద్రా సీఈఓ

ఆంధ్రా యూనివర్శిటీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమాన్ని డిసెంబర్‌లో నిర్వహించనున్నట్లు యూనివర్శిటీ వైఎస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ ప్రసాద్‌రెడ్డి, పూర్వ విద్యార్థుల అసోషియేషన్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ బీలా సత్యనారాయణ తెలిపారు. డిసెంబర్‌ 13న నిర్వహించే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, టెక్‌ మహీంద్రా సీఈఓ సి.పి గర్నాని ముఖ్య అతిథులుగా హజరవ్వనున్నట్లు వెల్లడించారు. ఏయూ పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమాన్ని విశాఖ బీచ్‌ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహిస్తామని ప్రొఫెసర్‌ పేర్కొన్నారు. ఈ సమ్మేళన కార్యక్రమానికి ఆంధ్రా యూనిర్శిటీలో డిగ్రీ పట్టా పొందిన పూర్వ విద్యార్థులంతా అహ్వానితులేనని, ఇందుకోసం వారు యునివర్శిటీ వెబ్‌సైట్‌ ద్వారా వారి పేరును నమోదు చేసుకోవాలని సూచించారు.

కాగా ఈ పుర్వా విద్యార్థుల అసోయేషన్‌ దేశంలోనే అతి పెద్ద అసోయేషన్‌గా రూపుదిద్దుకుంటుందని, ఏయూ యూనివర్శిటీ ద్వారా సుమారు 80 లక్షలకు పైగా విద్యార్థులు వివిధ డిగ్రీలు పొందారని తెలిపారు. ఇక పూర్వ విద్యార్థుల అసోషియేషన్‌ను ఒక ఛారిటబుల్‌ ట్రస్ట్‌గానే నిర్వహించబోతున్నామని, ఇందులోకి మాజీ డీజీపీ సాంబశివరావును కూడా తీసుకున్నామని వారు తెలిపారు. దీని ద్వారా పరీక్షల నిర్వాహణ ఫలితాల విడుదలలో మార్పులు చేశామన్నారు. ‘గతంలో ఆరేడు నెలలకు పైగా ఫలితాలకు సమయం పట్టేది.. కానీ ఇప్పుడు ఈ అసోసియేషన్‌ ద్వారా ఫలితాలను 25 రోజులలో ఇస్తున్నామన్నారు. అసోషియేషన్‌ స్థాపకుడు, అధ్యక్షుడు గ్రంధి మల్లికార్జున రావు(జీఎమ్‌ఆర్‌) 45 గదుల ప్రత్యేక హాస్టల్‌ను నిర్మించడానికి ముందుకు వచ్చారని, అదే విధంగా పూర్వ విద్యార్థులు, దాతల సహకారంతో ఏయూలో మౌలిక సదుపాయాలు పెంచడానికి కృషి చేస్తున్నామని అన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat