సర్కారీ నౌకరి కోసం ఎదురుచూసే నిరుద్యోగ యువతకు శుభవార్త. తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఈసీఐఎల్ లో పలు పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. ఈ ఉద్యోగాలను హైదరాబాద్ లోని హెడ్ క్వార్టర్ లో భర్తీ చేయనున్నది. మొత్తం 10ఖాళీలుగా ఉన్న టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ ఆర్టిసన్ లను భర్తీ చేయాలని నిర్ణయించింది. అయితే ఈ పోస్టుల కాలవ్యవధి ఏడాది మాత్రమే. ఆ తర్వాత ప్రాజెక్ట్ అవసరాలను బట్టి గడువు పొడిగించే అవకాశముంది. అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు www.ecil.co.in వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నవంబర్ 23న ఉదయం 09:30 గంటల నుంచి 12:00 గంటల వరకు ఇంటర్వ్యూకు హాజరవ్వాలి. అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్తో పాటు జిరాక్స్ సమర్పించాలి. అయితే రాతపరీక్ష లేదా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు.
