తాజాగా వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ ఉద్దేశించి తీవ్రంగా పరుష పదాలతో దూషించడం పట్ల వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా వంశీ తిట్టిన తిట్లు చేస్తూ రాజేంద్రప్రసాద్ ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. రాజేంద్రప్రసాద్ కాకి మాటలు మాట్లాడుతున్నాడని ఇప్పుడు నోటికి ఏది వస్తే అది మాట్లాడే వ్యక్తి అని విమర్శిస్తున్నారు. గతంలో విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో జగన్ పై హత్యాయత్నం జరిగిన నేపథ్యంలో అందరూ పార్టీలకతీతంగా తమ స్టాండ్ వినిపించారు. కొందరు విచారం వ్యక్తం చేయగా కొందరు మాత్రం జగన్ విమర్శించారు.. కావాలని చేయించుకున్నారు కూడా కూడా కొందరు విమర్శించారు. అయితే రాజేంద్రప్రసాద్ మాత్రం ఈ విషయంలో దారుణంగా వ్యాఖ్యానించారు కన్నతల్లి సొంత భార్య కలిసి జగన్ని చంపాలని చూసారు అని జగన్ చనిపోతే పదవి దక్కుతుందని దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. దీనిపై సొంత పార్టీ నేతలే రాజేంద్రప్రసాద్ ను తప్పుబట్టారు తాజాగా వంశీ డిబేట్లో రాజేంద్ర ప్రసాద్ ఎక్కడికక్కడ తిట్టడం పట్ల వైసీపీ సోషల్ మీడియా అభిమానులంతా భలే శాస్తి జరిగిందని ఏ మీడియాలో అయితే జగన్ కుటుంబంపై విమర్శలు చేసావో అదే మీడియాలో నీకున్న పరువు మొత్తం పోయింది అంటూ పోస్టులు పెడుతున్నారు.
