తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన అనంతరం ఓ మీడియా ఛానల్ లో లైవ్ లో వల్లభనేని వంశీ మాట్లాడుతున్నారు. ఆ సమయంలో లైవ్ లోకి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ వచ్చారు. ఈ క్రమంలో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ పార్టీకి సంబంధించి పలు వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ మాటలు వంశీ కి ఏమాత్రం నచ్చలేదు. పార్టీ కన్నతల్లి వంటిది అని మాట్లాడే రాజేంద్రప్రసాద్ పార్టీ దగ్గర డబ్బులు ఎలా తీసుకున్నారంటూ ప్రశ్నించారు. పెనమలూరు మాజీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ దగ్గర డబ్బులు ఎంత తీసుకున్నావు నాకు తెలియదా అంటూ ప్రశ్నించారు. నేను సుజనాచౌదరి నిన్ను చంద్రబాబు దగ్గరకు తీసుకెళ్లి టికెట్ ఇప్పించామని చామని రాజేంద్రప్రసాద్ మాట్లాడుతుండగా నువ్వు పెద్ద బఫూన్ నువ్వు ఏంట్రా బాబు నాకు టికెట్ ఇప్పించే ది మైండ్ పనిచేయట్లేదా అంటూ రాజేంద్రప్రసాద్ ను వంశి ఒక్క సారిగా ఇష్టానుసారంగా తిట్టే సారు.
రాజేంద్రప్రసాద్ కూడా వంశీకి ధీటుగానే స్పందించినా వంశీ దూకుడు ముందు రాజేంద్రప్రసాద్ మాట్లాడలేకపోయారు. పైగా తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న వ్యవహారాలను వంశీ ఒక్కొక్కటిగా మాట్లాడుతుండటంతో రాజేంద్రప్రసాద్ కు మాటలు రాలేదు. ఒకానొక సమయంలో వంశీ సంయమనం కోల్పోయి నువ్వు రోడ్డు మీద కనిపించు.. నీ సంగతి చెప్తాను అంటూ డొక్క పగిలిపోతుంది అంటూ వార్నింగ్ ఇచ్చారు. వంశీ నీ తెలుగుదేశం పార్టీలో ఇబ్బందులకు గురిచేయడం పార్టీ కార్యక్రమాల్లో అవమానించడం టిడిపిలో నిబద్ధత గా పని చేసిన జగన్ కోవర్ట్ అంటూ ఎద్దేవా చేయడం వంటివి మనసును బాధ పెట్టినట్టు స్పష్టంగా అర్థమవుతుంది.