Home / ANDHRAPRADESH / నారావారి పుత్రరత్నంపై వల్లభనేని వంశీ సంచలన వ్యాఖ్యలు..!

నారావారి పుత్రరత్నంపై వల్లభనేని వంశీ సంచలన వ్యాఖ్యలు..!

స్వర్గీయ ఎన్టీఆర్ మనవడు, టాలీవుడ్ స్టార్ హీరో, టీడీపీ భావి రథసారథిగా భావించే జూనియర్ ఎన్టీఆర్‌ను చంద్రబాబు పూర్తిగా పక్కన పెట్టేసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి జూనియర్‌ ఎన్టీఆర్‌‌కు ఉన్న నాయకత్వ లక్షణాలు, ఛరిష్మా టీడీపీలో ఎవరికి లేరు. 2009 ఎన్నికలలో అధికారం కోసం ఎన్టీఆర్‌ను అక్కున చేర్చుకున్న చంద్రబాబు ఎన్నికల ప్రచారం తర్వాత పట్టించున్న పాపాన లేదు. చంద్రబాబు తర్వాత టీడీపీని నడిపించే సత్తా ఒక్క జూనియర్ ఎన్టీఆర్‌కే ఉందని ప్రతి నందమూరి అభిమాని చెబుతాడు. అయితే ఎక్కడ తన కొడుకు లోకేష్‌కు పోటీ వస్తాడనే భయంతో చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్‌ను పూర్తిగా పక్కన పెట్టేశాడు. బాబు వాడకం అర్థం చేసుకున్న ప్రస్తుతానికి ఎన్టీఆర్ సినిమాలు చేసుకుంటూ పార్టీకి దూరమైపోయాడు. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత టీడీపీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్‌కు అప్పగించాలని నందమూరి అభిమానులు డిమాండ్ చేశారు. కాగా తాజాగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీకి రాజీనామా చేస్తూ చంద్రబాబు, లోకేష్‌లపై తీవ్ర ఆరోపణలు చేశారు. 2009 ఎన్నికల్లో సినిమాలు వదులుకుని, ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్.. ఇప్పుడు పార్టీలో ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. జయంతికి, వర్థంతి తేడా తెలియని లోకేష్‌ వంటి నేతలు సీనియర్ నేతలపై పెత్తనం చేయడం ఏందని మండిపడ్డారు. ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు పొత్తుల్లేకుండా ఒక్క ఎన్నికలోనైనా గెలిచారా అని ఎద్దేవా చేశారు..టీడీపీ మునిగిపోయే షిప్ అని..ఈసారి కాపాడడానికి ధర్మాడీ సత్యం కూడా రాలేడని వంశీ ఫైర్ అయ్యారు. వంశీ విమర‌్శలపై స్పందించిన లోకేష్.. హైదరాబాద్‌లో ఆస్తులు కాపాడుకోవడం కోసమే పార్టీ మారాడని కామెంట్ చేశాడు. లోకేష్ వ్యాఖ్యలపై మరోసారి వంశీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఆస్తులు ఎక్కడ ఉన్నాయో లోకేష్ చెప్పాలని వంశీ ప్రశ్నించారు. లోకేష్ చచ్చుదద్దమ్మ, పప్పు అని ఎద్దేవా చేశారు. లోకేష్‌కు, జూనియర్ ఎన్టీఆర్‌కు నక్కకు, నాగలోకానికి ఉన్న తేడా ఉందన్న వంశీ..పది జన్మలెత్తినా..ఎన్టీఆర్ స్థాయి లోకేష్‌కు రాదని, అందుకే మంగళగిరిలో ఓడిపోయాడని అన్నారు. లోకేష్ ముఖ్యమంత్రి అవుదామని అత్యాశపడుతున్నాడని, కాని ఆయన ఓ పప్పు అని వంశీ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.లోకేష్‌లాగా తాను అమ్మనో, అయ్యనో అడ్డం పెట్టుకుని రాజకీయాల్లోకి రాలేదని, స్వయం కృషితో ఎదిగానని అన్నారు. చంద్రబాబు లేని రోజు వాడి బతుకుందే తెలుస్తుందని వంశీ మండిపడ్డారు. అమ్మాయిల ఫోటోలను మార్ఫింగ్ చేయించి, తనపై టీడీపీ సోషల్ మీడియా వింగ్ చేస్తున్న దుష్ప్రచారంపై వంశీ ఫైర్ అయ్యారు. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని తనపై లోకేష్ పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టిస్తున్నాడని..వాడొక బాల్ బచ్చా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ చచ్చు దద్దమ్మ..పది జన్మలెత్తినా జూనియర్ ఎన్టీఆర్ స్థాయి లోకేష్‌కు రాదు అంటూ వల్లభనేని వంశీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అవును..లోకేష్, తమ హీరో కాలిగోటికి కూడా సరిపోడని జూనియర్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం వంశీ కామెంట్స్‌తో టీడీపీలో ఓ వర్గం జూ. ఎన్టీఆర్‌కు మద్దతుగా, మరొక వర్గం లోకేష్‌‌కు మద్దతు పలుకుతున్నారు. మొత్తంగా వంశీ వ్యాఖ్యల నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్‌కు టీడీపీని అప్పగించాలని నందమూరి అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat