టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ ఇతర టీడీపీ నేతలపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేసిన విమర్శలపై టీడీపీ శ్రేణులు మండిపడ్డాయి. ఈ మేరకు ఇవాళ వంశీ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన టీడీపీ నేతలు..కన్నతల్లి లాంటి పార్టీకి వంశీ ద్రోహం చేశాడని, గంగానదిలాంటి పార్టీని వదిలి సముద్రంలోకి వెళ్లాడంటూ విమర్శలు గుప్పించారు. అలాగే వంశీని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. తాజాగా టీడీపీ నేతల విమర్శలపై, తన సస్పెండ్‌పై వంశీ స్పందించారు. నాపై విమర్శలు చేసేవాళ్లు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినవాళ్లు కాదు. గుడ్డు పెట్టే కోడికే తెలుస్తుంది గుడ్డు ఎలా పెట్టాలనేది? నేనేమైనా పప్పు తింటున్నానా..రాంగోపాల్ వర్మ చూపించినట్లు.. పప్పా…నేను చదువుకున్నవాడిని..నేనేమైనా పనికిమాలినవాడిన ..నేనేమి ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రజలపై బలవంతంగా రుద్దబడినవాడినా…అంటూ లోకేష్‌ను ఉద్దేశించి సెటైర్ వేశారు. ఇక తనను పార్టీ నుంచి చంద్రబాబు సస్పెండ్ చేయడంపై వంశీ తీవ్రంగా స్పందించారు..గాడిద గుడ్డులె…నేనే రిజైన్ చేస్తే వాడు నన్ను సస్పెండ్ చేయడం ఏంటీ..అంటూ తీవ్రంగా వల్లభనేని వంశీ మండిపడ్డారు. చంద్రబాబు వయసైపోయి మతిలేని మాటలు మాట్లాడుతున్నారని వంశీ అన్నారు. నేను వాస్తవం అనుకున్నదే ప్రెస్‌మీట్‌లో చెప్పాను..నా వెనుక ఉండి ఎవరూ నడిపించడం లేదని ఆయన స్పష్టం చేశారు. వంశీ ఇలా చంద్రబాబు, లోకేష్‌లపై డైరెక్ట్‌గా ఎటాక్ చేయడంపై పార్టీలో చర్చ జరుగుతోంది. ఇన్నాళ్లుగా తనకు పార్టీలో ఎదురైన అవమానాలు, తనను తొక్కేయడానికి పార్టీలోని కొన్ని శక్తులు చేస్తున్న కుట్రలకు విసిగి వేసారిన వంశీ..ఇప్పుడు రాజీనామా చేశాక..బాబు, లోకేష్‌లపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడుతున్నారంటూ..ఆయన అనుచరులు అంటున్నారు. మొత్తంగా గాడిదగుడ్డులె నన్ను వాడు సస్పెండ్ చేయడం ఏంటి అంటూ వంశీ ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాల్లో కలకలం రేపుతోంది.
