తాజాగా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తానని వెల్లడించారు. ఈ క్రమంలో ఆయన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ పైన విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం పార్టీ మునిగిపోయే నావ అని ఎవరూ వచ్చినా కూడా ఆ పార్టీని బయటకు తీయలేడని చెప్పుకొచ్చారు. చంద్రబాబుతో ఎవరికి బాండింగ్ ఉండదని చెప్పిన వంశీ జయంతికి వర్ధంతికి తేడా తెలియని లోకేష్ తో పనిచేయడం ఎలా అంటూ ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీకి ప్రజావ్యతిరేక విధానాలను పెంచుతుందని ప్రభుత్వంపై దీక్ష ఏమిటని వంశీ ఫైర్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను పనులను అభినందిస్తూ ఆ పార్టీ వెంట నడవాలని జగన్ తో కలిసి పనిచేయాలని ఉందని అతి త్వరలోనే పార్టీ రాజీనామాకు సంబంధించి టెక్నికల్ అంశాలన్నింటినీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
