గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి గుడ్‌బై చెప్పి.. వైసీపీకి జైకొట్టడంతో.. ఏపీ రాజకీయాలు హాట్‌హాట్‌గా మారాయి. ఇవాళ వల్లభనేని వంశీ ఓ ఛానెల్ నిర్వహించిన చర్చాకార్యాక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వం తీసుకుని వచ్చిన ఇంగ్లీష్ మీడియంపై విమర్శలు చేస్తున్న పవన్ కళ్యాణ్‌పై మండిపడ్డారు. పవన్ కల్యాణ్ వ్యక్తిగతంగా ఎంతో మంచోడని.. కానీ స్థిరంగా ఉండలేడన్నారు. అంతేకాదు ఎప్పుడు ఆందోళన చేస్తాడో.. ఎప్పుడు సైలంట్ అవుతాడో తెలియదన్నారు. అలాగే తెలుగు దేశం పార్టీ జాతీయ పార్టీ అయినప్పుడు తెలంగాణ ఆర్టీసీ ఉద్యమంలో చంద్రబాబు ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు వల్లభనేని వంశీ. అలాగే తన దగ్గరకు వచ్చిన ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేసేందుకు ముఖ్యమంత్రితో మాట్లాడుతానంటూ చెప్పిన పవన్ కళ్యాణ్ అక్కడ ఎందుకు ప్రశ్నించట్లేదు అని నిలదీశారు. జగన్‌కు మద్దతు ఇస్తే నాకు వ్యక్తిగతంగా లాభం లేదు అని, కేసులకు భయపడను.. వాటికి కోర్టు ఉందని అన్నారు వంశీ. జగన్‌తో ఉంటే పేద ప్రజలకు మంచి చేయగలుగుతాను. అనే నమ్మకం ఉందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు వల్లభనేని వంశీ. రాజీనామా చేసి అయినా ప్రభుత్వానికి మద్దతు తెలుపుతానని, నియోజకవర్గం కోసం దేనికైనా సిద్ధం అన్నారు.
