ఐపీఎల్ పేరు చెబితే ముందుగా అందరికి గుర్తుకొచ్చే జట్లు ముంబై మరియు చెన్నై నే. ఈ రెండు జట్లు చాలా ప్రత్యేకమైనవే. ఇక ముంబై విషయానికి వస్తే దేశంలోనే నెంబర్ వన్ కింగ్ అంబాని జట్టు అది. దానిబట్టే అర్ధం చేసుకోవచ్చు అది ఎంత రేంజ్ అనేది. టైటిల్ విజేతలు విషయంలో ముంబై నే టాప్. మరోపక్క వచ్చే ఏడాది ఐపీఎల్ కు ఆ జట్టు ఇంకా గట్టిగా తయారయ్యిందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు జట్టు కు ట్రెంట్ బౌల్ట్ కలిసాడు. దాంతో అటు బూమ్రా, మలింగ, బౌల్ట్ తో చాలా బలంగా గా ఉందని చెప్పాలి. అయితే ఈసారి టైటిల్ ఫేవరెట్ మళ్ళీ ముంబై అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.