తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు ఈ రోజు శుక్రవారం సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా పుల్కల్ మండలం సింగూర్ లో 150 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, 141 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను,మరియు గ్రామా పంచాయతీ అభివృద్ధి కోసం కొత్తగా ట్రాక్టర్లను సర్పంచ్ లకు మంత్రి హరీష్ రావు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ” హైదరాబాద్ లో కూకట్ పల్లి , బి హెచ్ ఈ ఎల్ గ్రేటర్ కమ్యూనిటీ ని తలపించేలా అన్ని హంగులతో లబ్ధిదారులకు ఇళ్ళు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది.తెలంగాణ కోసం అమరులైన వారి పేర్లు అదేవిధంగా రాష్ట్రం కోసం పోరాడిన మహిణీయుల పేర్లతో డబుల్ బెడ్ రూమ్ బ్లాక్ ల వారిగా పెట్టడం జరుగుతుంది.అమరుల త్యాగాల వల్లే మనకు ఈ రాష్ట్రం సాధ్యమైంది.అందుకే వారి బాటలో నడవాలి.పేద వాళ్లకు అసౌకర్యం కలగకుండా అన్ని హంగులతో లబ్ధిదారులకు ఇళ్ళు ఇవ్వడం జరిగింది.
డబుల్ బెడ్ పథకం గొప్పది.నిరుపేదలకు పైసా ఖర్చు లేకుండా ఇల్లు నిర్మాణం చేసి ఇస్తున్నాము.పేదల ఆత్మ గౌరవం కోసమే డబుల్ బెడ్ ఇండ్లు.దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఇండ్ల నిర్మాణం చేసి ఇస్తున్నము.కాంగ్రెస్ ప్రభుత్వం లో ఇండ్ల కోసం పేదలు చెప్పులు అరిగేలా తిరిగి….అప్పుల పలు అయ్యారు.తెలంగాణ ప్రభుత్వం లో చేస్తున్న అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి.సింగూర్ ప్రాజెక్ట్ పై 300 కోట్లు ఖర్చుచేసి….సాగునీరు ఇచ్చాము.ఈ సారి వర్షాలు లేక…సింగూర్ ప్రాజెక్ట్ నిండక సాగునీరు ఇవ్వలేకపోయము.కాళేశ్వరం ప్రాజెక్ట్ నుండి సింగూర్ ప్రాజెక్ట్ కు అనుసంధానం చేసి ప్రాజెక్ట్ నింపుతాము.కాళేశ్వరం అనుసంధానం ద్వార ఆందోల్, నారాయణ ఖేడ్, జహీరాబాద్ కు నియోజకవర్గ లకు సాగునీరు ఇస్తాము.ముఖ్యమంత్రి గారు కట్టించిన ఇళ్ళు పేదవల్లే నివసించాలి.
అమ్ముకుమ్మ కొన్న చర్యలు తీసుకుంటాం.226 మందికి 2కోట్ల 26 లక్షల 200 వందల రూపాయల చెక్కులను పేద ఆడపిల్ల కుటుంభలకు ఆసరాగా లక్ష రూపాయల చెక్కును ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం.ఆడపిల్ల పెళ్ళైనకా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా డెలివరీతో పాటు కేసీఆర్ కిట్టు ఇచ్చి 12వెల రూపాయల చెక్కు ఇచ్చి తల్లి పిల్లలను అమ్మఒడి వాహనం లో క్షేమంగా కేసీఆర్ ప్రభుత్వం ఇంటికి చేరుస్తుంది….పేదల కోసం డబుల్ బెడ్ ఇల్లు.. రైతుల కోసం రైతు బంధు .. భీమా,24 గంటల పాటు నాణ్యమైన కరెంటు కెసిఆర్ ప్రభుత్వం అందిస్తుంది. ప్రతి అంశంలో కూడా కెసిఆర్ ప్రభుత్వం ఆలోచిస్తుంది.దేశమంతటా వర్షాలు పడి ప్రాజెక్టులు పొంగిపొర్లుతుంటే సింగూర్ లో మాత్రం చుక్క వర్షం పడటం లేదు.భవిష్యత్ లో కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి సింగూర్ నింపుతాం..నిండు కుండల చేస్తాం..40 వేల ఏకరాలకు రెండు పంటలకు నిరందిస్తాం. అందోల్ నియోజకవర్గంలో సాగుకు లక్ష ఏకరాలకు సాగునీరు అందిస్తామన్నారు.