సూపర్ స్టార్ ,స్టార్ హీరో రజనీ కాంత్ తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారని వార్తలు పుఖార్లై వినిపిస్తున్న సంగతి విదితమే. ఆ మధ్య రజనీ కాంత్ పార్టీ పెడతారని.. అందుకే అభిమానులను,ప్రజలను కలుస్తున్నారని కూడా వార్తలను మనం చూశాము. తాజాగా డీఎంకే మాజీ అధ్యక్షుడు,మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తనయుడైన మాజీ కేంద్ర మంత్రి అళగిరి రజనీ కాంత్ పొలిటికల్ ఎంట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆయన మదురై నుంచి విమానంలో చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో విలేఖర్లు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా అళగిరి మాట్లాడుతూ” నేను ప్రస్తుతం డీఎంకే పార్టీలో లేను. ఆ పార్టీకి నాకు సంబంధం ఏమి లేదు. దివంగత మాజీ ముఖ్యమంత్రులు కరుణానిధి,జయలలిత మరణం తర్వాత తమిళనాట రాజకీయ వెలతి ఏర్పడింది.
ప్రస్తుతం తమిళనాడుకు నాయకుడు కావాలి. అది సూపర్ స్టార్ రజనీకాంత్ అయితే న్యాయం చేయగలరు. ఆయన త్వరలోనే పార్టీ పెడతారని ఆశిస్తున్నానని అన్నారు. దీనికి స్పందించిన విలేఖర్లు మీరు రజనీ కాంత్ పెట్టబోయే పార్టీలో చేరతారా అని అడగ్గా .. ముందు అయితే రజనీ కాంత్ ను పార్టీని పెట్టానివ్వాలి కదా అని అక్కడ నుంచి వెళ్ళిపోయారు.