వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వ హయంలో చంద్రబాబుకు వత్తాసు పలికిన పవన్, ఇప్పుడు సొంతంగా పోటీచేసినప్పటికీ ఇంకా బాబు ముసుగులో నడుస్తునాడని వార్తలు వస్తూనే ఉన్నాయి. మొన్న లాంగ్ మార్చ్, నిన్న దీక్ష ఇలా ఏది చూసిన వారిద్దరూ ఒక్కటేనని తెలుస్తుంది. ఇంక పవన్ కళ్యాణ్ ను సోషల్ మీడియాలో ఏమనుకుంటున్నారో ఆయన వివరించారు.‘నిత్య కళ్యాణం’ గురించి సోషల్ మీడియాలో ఏమనుకుంటున్నారంటే… సీజన్లో వచ్చిపోయే డెంగ్యూ, చికెన్ గున్యా వ్యాప్తి చేసే దోమ లాంటోడట. వర్షాకాలంలో ఎగిరెగిరి, శీతాకాలంలో చల్లబడి, వేసవిలో కనిపించకుండా పోతాడట. ఇన్నాళ్లు నడిచిందేమో కాని ఇకపై ‘దోమ’లకు కష్టకాలమే అని అన్నారు.
