మహారాష్ట్ర రాజకీయాల్లో గత కొంతకాలంగా నెలకొన్న అధికారం ఎవరు చేపడతారనే సస్పెన్స్ కు తెర తొలగినట్లే అని వార్తలు వస్తోన్నాయి. ఇటీవల విడుదలైన మహారాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ,శివసేన,ఎన్సీపీ,కాంగ్రెస్ లలో ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారీటీ సాధించలేదు.
దీంతో ముందుగా పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఆహ్వానిస్తే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పడ్నవీస్ అంతమెజారిటీ లేదని తిరస్కరించారు.ఆ తర్వాత పెద్ద పార్టీగా అవతరించిన శివసేన పార్టీని ఆహ్వనించగా కాంగ్రెస్,ఎన్సీపీలతో చర్చలు జరుపుతుంది.
ఈ చర్చల్లో భాగంగా శివసేన పార్టీకి ముఖ్యమంత్రి పదవీ .. కాంగ్రెస్ ,ఎన్సీపీలకు ఉప ముఖ్యమంత్రులతో పాటుగా రెండు పార్టీలకు చెరో పద్నాలుగు మంత్రి పదవులు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి శివసేన పార్టీ ముందుకొచ్చింది మహా రాజకీయాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.ఇందుకు శివసేన ,కాంగ్రెస్,ఎన్సీపీల మధ్య చర్చలు జరుగుతున్నాయని కూడా వార్తలు వస్తోన్నాయి..