సీనియర్ నటుడు ప్రభాస్ పెదనాన్న యువి కృష్ణంరాజు ఆరోగ్య పరిస్థితి పై అనేక రకాల వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం చాలా సీరియస్ గా ఉందని అనేక వెబ్సైట్లు, కొన్ని పేపర్లు రాసాయి. దీంతో హాస్పిటల్ నుంచి వచ్చిన కృష్ణంరాజు మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్పిటల్ కి వెళ్తే ఇష్టం వచ్చినట్టు రాసేస్తారా.? రెగ్యులర్ గా వెళ్ళే జనరల్ చెకప్ కి వెళ్లాను.. అంతేగాని సీరియస్ గా లేదు అంటూ చెప్పుకొచ్చారు. అలాగే తనకు న్యూమోనియా ఉన్నమాట వాస్తవమేనని అన్నారు.. అంతేగాని మీడియాలో చెబుతున్నట్టు తనకు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వచ్చిన వార్తలు వాస్తవం కాదన్నారు.
