గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని ప్రెస్‌మీట్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, దేవినేని ఉమ, ఇతర టీడీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో టీడీపీ నేతలు ఆయనపై విరుచుకుపడుతున్నారు. అంతే కాదు ఏకంగా వంశీపై లోకేష్ ఆధ్వర్యంలోని టీడీపీ సోషల్ మీడియా వింగ్ రంగంలోకి దిగింది. ఆడపిల్లల పేరుతో ఫోటోలు మార్ఫింగ్ చేస్తూ సోషల్ మీడియాలో వంశీని కించపర్చేలా ప్రచారం చేస్తోంది. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని గమనించిన వల్లభనేని వంశీ…ఇవాళ విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావును కలిసి ఫిర్యాదు చేశారు. తనను ఆడపిల్లల పేర్లుతో ఫోటోలు మార్ఫింగ్ చేస్తూ, సోషల్ మీడియాలో తనను కించపర్చేలా అసభ్యంగా పోస్టులు పెడుతున్నారని ఎమ్మెల్యే వంశీ సీపీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘టీడీపీ సోషల్ వింగ్ పేరుతో సర్క్యులేట్ చేసినట్లు మా దృష్టికి వచ‍్చింది. నా రాజకీయ భవిష్యత్ నాశనం చేయాలని కొందరు వ్యక్తులు మానవత్వం లేకుండా మా కుటుంబాన్ని కించపరుస్తున్నారు. అందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీపీని కోరాను. అటువంటివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హామీ ఇచ్చారంటూ ఎమ్మెల్యే వంశీ తెలిపారు. నిజాలను ధైర్యం మాట్లాడి చంద్రబాబు కుటిల రాజకీయాలను, లోకేష్ అసమర్థతను, దేవినేని ఉమ లాంటి నీచ రాజకీయవేత్తలను ఎండగట్టిన వంశీపై టీడీపీ సోషల్ మీడియా వింగ్ చేస్తున్న దుష్ప్రచారంపై ఆయన అభిమానులు మండిపడుతున్నారు. నువ్వు, నీ కొడుకు చేస్తున్న తప్పులను ఎత్తిచూపితే….ఇలా ఆడపిల్లల ఫోటోలతో అసభ్యంగా చిత్రీకరిస్తూ ప్రచారం చేయిస్తావా..మీరసలు నాయకులేనా..అంటూ చంద్రబాబు, లోకేష్‌లపై వంశీ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.