టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ రెండో రోజులో భాగంగా భారత్ భారీ స్కోర్ దిశగా పయనిస్తుంది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ జట్టుకి కొండంత అండగా నిలిచాడు. ప్రస్తుతం 150పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరోపక్క రహానే అతడికి మంచి స్టాండింగ్ ఇస్తున్నాడు. మొన్న సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లలో కూడా మయాంక్ తన అద్భుతమైన ఆటతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు కూడా అదే ఆటతీరుతో ముందుకు సాగుతున్నాడు. ఇక మయాంక్ కు ఒక సలహా కూడా ఇవ్వడం జరిగింది. ఈ సన్నివేశం టీవీలో క్లియర్ గా చూపించారు. అదేమిటంటే నువ్వు ఔట్ అవ్వకు డబుల్ సెంచరీ దిశగా ముందుకు సాగిపో అని అని చెప్పగా నేను చూసుకుంటా అంటూ మయాంక్ సిగ్నల్ ఇచ్చాడు.
