తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు ఈ రోజు శుక్రవారం సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ” మార్కెట్ యార్డులలో.. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పని చేసే హమాలీ ఛార్జీలు రైతుల ఖాతాలోనే నేరుగా జమచేయాలని అధికారులకు ఆదేశాలను జారీ చేశారు.
జిల్లాలోని గోంగులూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి హారీష్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో కొనుగోలు కేంద్రాల్లో మమ్త్రి హారీష్ రావు రైతన్నల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా సుతిలీ తాళ్లు రైతులే తెచ్చుకోవాలన్న బోర్డును చూసి మంత్రి హారీష్ రావు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రైతులు మంత్రికి హమాలీ ఛార్జీలు జమ కావడం లేదు అని తెలపడంతో రైతులు చెప్పిన సమస్యను పరిష్కరించాలని అధికారులను ఫోన్ లో ఆదేశించారు.