తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ తన స్నేహితుడు నందమూరి వారసుడు అయిన జూనియర్ ఎన్టీఆర్ను ఉద్దేశించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తన కెరీర్ ను పణంగా పెట్టి రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి విస్తృతంగా ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ ను అనంతర కాలంలో చంద్రబాబు పక్కన పెట్టారు అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు అవసరమైతే ఎవరు కాలైనా పట్టుకుంటాడు అని గతంలో ఎన్టీఆర్ కాళ్ళు పట్టుకున్నట్లుగా 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కాళ్లు పట్టుకోలేదా అని ప్రశ్నించారు.
ఆ పట్టుకునే కాళ్లు ఏవో 2014లో కూడా ఎన్టీఆర్ ను ఎందుకు పట్టుకోలేదు. ఒకవేళ ఎన్టీఆర్ పార్టీకి ప్రచారం చేసి మళ్లీ పార్టీలోకి తీసుకు వస్తే మనుగడ ఉండదని అందరూ ఎన్టీఆర్ చుట్టూనే ఉంటారని ఇది గ్రహించి నక్క తెలివి తేటల్ని ఉపయోగించే చంద్రబాబు ఎన్టీఆర్ని దూరం పెట్టారంటూ వంశీ వ్యాఖ్యానించారు. అయితే ఇంతకాలం ఈ విషయాలు బయట ప్రజలందరూ సామాన్యంగా అనుకుంటున్న హయ్యర్ అఫిషియల్ నుంచి ఎవరు కూడా బాహాటంగా చెప్పలేదు అయితే యాదృచ్చికంగా విలేకరుల సమావేశంలో వంశీ ఈ విషయాలను బహిర్గతం చేయడంతో అందరూ చంద్రబాబు తెలివితేటలు చూసి ఔరా అనుకుంటున్నారు