బిగ్‌బాస్ నటి అర్చన, ప్రముఖ హెల్త్‌కేర్ కంపెనీ ఉపాధ్యక్షుడు, వ్యాపారవేత్త జగదీశ్ భక్తవత్సలంల వివాహం గురువారం ఘనంగా జరిగింది. మూడు ముళ్లతో వైవాహిక బంధానికి వారు స్వాగతం పలికారు. ఈ వివాహానికి పలువురు సినీ ప్రముఖులు హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. కాగా కుటుంబసభ్యులు, సినీ ప్రముఖుల సమక్షంలో వీరి నిశ్చితార్థం అక్టోబర్ 3న జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మంగళవారం రాత్రి సంగీత్‌తో పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. బుధవారం రాత్రి ప్రముఖ ఫంక్షన్‌హాల్‌లో పెళ్లి రిసెప్షన్ నిర్వహించారు. హైదరాబాద్‌లో గురువారం తెల్లవారుజామున 1.30 గంటలకు అర్చన(వేద), జగదీశ్ వివాహబంధంతో ఒక్కటయ్యారు.బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ 1లో కంటెస్టెంట్‌గా పాల్గొని అందరికీ సుపరిచితురాలయ్యింది. ఈ షోతో తగిన గుర్తింపు తెచ్చుకున్న అర్చన పలు షోలకు జడ్జిగా వ్యవహరించింది.