తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఈ రోజు రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ముగిసింది. మంత్రి కేటీఆర్ అధ్యక్షతన తెలంగాణభవన్‌లో జరిగిన భేటీకి పార్టీ ఎంపీలు హాజరయ్యారు. ఈ నెల 18 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న సమయంకలో పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎంపీలకు ఆయన దిశానిర్దేశం చేశారు.