తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో మనకు తెల్సిందే. ఎవరన్నా కష్టాల్లో ఉన్నారంటే చాలు నేనున్నాను అని వెంటనే స్పందిస్తాడు. స్పందించడమే కాదు ఆ సమస్య పరిష్కారం కోసం తనవంతు పాత్ర పోషిస్తాడు మంత్రి కేటీ రామారావు. తాజాగా ఇప్పుడు ఇది పక్క రాష్ట్రాలకు కూడా చేరింది.ఈ క్రమంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన శిల్పారెడ్డి అనే అమ్మాయికి స్పైనల్ కార్డ్ సమస్య ఉంది. శిల్పారెడ్డికి ఆపరేషన్ చేస్తే తప్పా నడవలేని పరిస్థితి ఉందని వైద్యులు తెలిపారు. అంతేకాకుండా ఆపరేషన్ కు దాదాపు పది లక్షల వరకు ఖర్చు అవుతుందని సూచించారు వైద్యులు. ఇందుకు శిల్పా హీరో మహేష్ బాబును వేడుకోగా ఆమె ఆపరేషన్ కు పదిలక్షలు ఆర్థిక సాయమందించడంతో ఆపరేషన్ చేయించుకుంది శిల్పా. అయితే ఆపరేషన్ తర్వాత ఆమెకు ప్రధాన సమస్య వచ్చి పడింది. అదే నడవాలంటే కాళ్లకు బెల్ట్ వేయించుకోవాలి. ఇందుకు రూ. తొంబై వేల దాకా ఖర్చు అవుతుంది. అందుకు సాయం చేయాలని మంత్రి కేటీఆర్ కు ట్విట్టర్ ద్వారా వేడుకుంది. అంతే కేటీ రామారావు వెంటనే ప్రభుత్వం తరపున సాయం చేయలేము కానీ దాతాలు ద్వారా సాయమందేలా చేస్తానని హామీచ్చాడు. ఈ క్రమంలోనే ఒక మంచి మనసున్న ఓ వ్యక్తి శిల్పకు సాయం చేయడానికి ముందుకొచ్చారు. దీంతో అతడు ఇచ్చిన చెక్‌ను మంత్రి కేటీఆర్ శిల్ప కుటుంబ సభ్యులకు శుక్రవారం అందజేశారు.
Since the girl was from Karnataka, we couldn’t help her from Govt
But a good friend, who wants to be anonymous has come forward to support Shilpa. Handed over the cheque today ? pic.twitter.com/x9wiWlTw5A
— KTR (@KTRTRS) November 15, 2019