ఏపీ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు కృష్ణాజిల్లాలో భారీ షాక్ తగిలింది. ఇప్పటికే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా తెలుగు యువత అధ్యక్ష్య పదవికి, టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన దేవినేని అవినాష్ గురువారం వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని కలిశారు. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో దేవినేని అవినాష్‌తో పాటు టీడీపీ సీనియర్ నాయకుడు కడియాల బుచ్చిబాబు వైఎస్సార్ సీపీలో చేరారు. వారిద్దరికీ ముఖ్యమంత్రి… కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా దేవినేని అవినాష్ ఇవాళ తెలుగుదేశం పార్టీతో పాటు తెలుగు యువత అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి పంపించారు.
