గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. అటు జగన్ ని నమ్ముకున్న ప్రజలు ఆయనను అఖండ మెజారిటీతో గెలిపించారు. ఇదంతా మనసులో పెట్టుకున్న చంద్రబాబు ఎలాగైనా ఏదోక రకంగా జగన్ ను వేదించాలని ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఒక్కోకరిని వరుసగా జగన్ పై వదులుతున్నాడు. అయినప్పటికీ ఎవరూ ఏం చెయ్యలేకపోతున్నారు. మొన్నటికీ మొన్న సొంత పుత్రుడు లోకేష, ఆ తరువాత దత్తపుత్రుడు పవన్ ను బరిలోకి దింపినా ఎవరూ ఏం చెయ్యలేకపోయారు. చివరికి ఇప్పుడు అందరు బాషపై పడ్డారు. అటు పవన్ కళ్యాణ్ కూడా ఉద్దండ పండితుడిలా మాట్లాడుతున్నాడు. దీనిపై స్పందించిన వైసీపీ నేత విజయసాయి రెడ్డి “శ్రీ వేంకటేశ్వర సుప్రభాతాన్ని కూడా ఇంగ్లిష్ లో చదివంచడని ‘నిత్యకళ్యాణం’ అనడం చూస్తే రెండు లక్షల పుస్తకాలు చదివింది ఎంత నిజమో తెలిసిపోతుంది. సుప్రభాతం సంస్కృతంలో ఉంటుందని ‘జ్ఞాని’కి తెలియదు. ఎవరైనా బ్రీఫ్ చేస్తే తప్ప దేనిపై ఎలా విమర్శించాలో అంతుబట్టనట్టుంది” అని అన్నారు.
