గురువారం ఇండోర్ వేదికగా ఇండియా,బంగ్లాదేశ్ మధ్య మొదటి టెస్ట్ ప్రారంభం అయింది. ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ తీసుకున్న బంగ్లా ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయింది. బంగ్లా ఓపెనర్స్ చేతులెత్తేశారు. టీ20 సిరీస్ కోల్పోయిన బంగ్లా ఇందులో ఐనా పట్టు బిగించి విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. మరోపక్క భారత్ మాత్రం పులిని వేటాడే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం జట్టు స్కోర్ 5 వికెట్ల నష్టానికి 115పరుగులు చేసింది. దీంతో బంగ్లా కష్టాల్లో పడిందనే చెప్పాలి. ప్రస్తుతం రహీమ్, లిటన్ దాస్ గ్రీజ్ లో ఉన్నారు.