ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్లు బాబుగారి ఇసుక దీక్ష తెలుగు తమ్ముళ్ల చావుకు వచ్చింది. ఏపీలో ఇసుక కొరతపై టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడలో 12 గంటల నిరాహారదీక్ష చేపట్టారు. ఇసుక కొరత విషయంలో ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రంగా ఉందన్న సంకేతాలు ప్రజల్లోకి పంపాలంటే. నా దీక్షకు వేలాది మంది భవన నిర్మాణ కార్మికులను తరలించారని బాబుగారు స్వయంగా టీడీపీ నేతలకు హుకుం జారీ చేశారంట…అయితే స్థానికంగా రాజధాని జిల్లాలతో పాటు, పక్కనే ఉన్న పశ్చిమగోదావరి జిల్లాల నుంచి విజయవాడకు వచ్చేందుకు భవన నిర్మాణ కార్మికుల సంగతి దేవుడెరుగు కనీసం పార్టీ కార్యకర్తలు కూడా ఆసక్తి చూపలేదంట. ఈ విషయం గ్రహించిన బాబుగారు..తెలంగాణ సరిహద్దు జిల్లాలైన సూర్యాపేట, ఖమ్మం జిల్లాల నుంచి కూలీలను తరలించి విజయవాడలో భారీ జన ప్రదర్శన చేయాలని ఆర్డరేశారంట..దీంతో టీడీపీ నేతలు తెలంగాణ సరిహద్దు జిల్లాల నుంచి టీడీపీ కార్యకర్తలతోపాటు, భవన నిర్మాణ కూలీలతో పాటు, వ్యవసాయ పనులు లేని కూలీలను కూడా రప్పించారంట..ఒక్కొక్కరికి రూ. 500/- ఇచ్చి, బస్సులు కూడా ఏర్పాటు చేసి మరీ విజయవాడకు తరలించారంట. మొత్తంగా బాబుగారి ఇసుక దీక్షకు ఏపీ కూలీలు దొరకక తెలంగాణ టీడీపీ కార్యకర్తలను, కూలీలను తరలించిన వైనం ఏపీ ప్రజలను విస్మయపరుస్తోంది.వార్నీ..మేనేజ్మెంట్ గురు అంటే ఏంటో అనుకున్నాం..ఆఖరికి ఇసుక దీక్ష ఈవెంట్కు కూడా తెలంగాణ కూలీలను తరలించావా..మీరు మీరు మహాముదురు సామి అంటూ అనుకోవడం తప్పా..మనమేం చేయలేము..బాబుగారు అన్నీ అలా మేనేజ్ చేస్తూ ఉంటూ ఉంటారు..మనం అలా నోరెళ్లబెట్టి చూస్తూ ఉండాల్సిందే..అంతేగా అంతేగా..
