తన యాంకరింగ్ తో తెలుగు టీవీ,సినిమా ప్రేక్షకులకు చేరువైన వారు ఒకరు. మరోవైపు తన నటనతో.. అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకుల మెప్పును పొంది టాలీవుడ్ ఇండస్ట్రీ టాప్ హీరోలల్లో ఒకరిగా రాణిస్తున్నవారు. వీరే ఒకరు యాంకర్ సుమ..
మరోకరు జూనియర్ ఎన్టీఆర్. సుమ హీరో జూనియర్ ఎన్టీఆర్ కు సవాల్ విసిరింది. తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు మొక్కలను నాటడం కోసం గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని తీసుకొచ్చిన సంగతి విదితమే.
ఇందులో భాగంగా యాంకర్ సుమ తన నివాసంలో మొక్కలను నాటింది. తను మొక్కలు నాటిన తర్వాత టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.