తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న ప్రోటోకాల్ చట్టం అంతా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లో రాసుకున్నవి. తెలంగాణలో సరికొత్త ప్రోటోకాల్ చట్టాన్ని తయారు చేయవాల్సిన అవసరాన్ని అధికారులు గుర్తించాలని తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.శాసన మండలి సమావేశం మందిరంలో విశేష అధికారుల కమిటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ అధ్యక్షతన విశేష అధికార ల కమిటీ మొదటి సమావేశం జరిగింది. ముఖ్య అతిధి గా పాల్గొన్న మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సభ్యులు నాయిని నర్సింహారెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి ఫరూక్ హుస్సేన్ లు పాల్గొన్నారు. తెలంగాణ ప్రోటోకాల్ బుక్ ను రిలీజ్ చేయాలని ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ సందర్భంగా సూచించారు. మండలి సభ్యుల కు ఇచ్చే గౌరవము, భాద్యతలు గురించి జిల్లా అధికారులకు స్పష్టమైన అదేశాలు యివ్వాలని అధికారులను ఆదేశించారు.
ప్రధానంగా మండలి చైర్మన్, వైస్ చైర్మన్ అదే విదంగా సభ్యుల కు వుండే అధికారుల గురించి చాల మందికి తెలియడం లేదని యిది చాలా బాధాకరమని అన్నారు. రాజ్యాంగ బద్దంగా మండలి కి విశేష అధికారాలు ఉన్నాయని వాటి గురించి ఆర్టికల్ 14 లో వివరించి ఉందని గుత్తా అన్నారు. అయితే చాలా మంది అధికారులు చట్టాలను అవగాహన చేసుకోవడం లేదని, కొంత మంది అసలు చదవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.లోకల్ బాడీ, టీచర్, గ్రాడ్యుయేట్, ఎం ఎల్ సి ల విషయములో ప్రోటోకాల్ పట్టించుకోవడం లేదన్నారు.
పలు చోట్ల అధికారుల కు ప్రోటోకాల్ గురించి తెలియడం లేదు. దానితో అవమానానికి గురి కావలసి వస్తుందని మళ్ళీ యిలా రిపీట్ కాకుండా చూడాలని గుత్తా అన్నారు. రాజ్యాంగ బద్దంగా శాసన మండలి కి ఉన్న అధికారాలను బ్లూ బుక్ లో ఉన్నాయని వాటిని చదివితే ప్రోటోకాల్ సమస్య ఎక్కడ రాదని స్పష్టం చేశారు. పలు చోట్ల చిన్న చిన్న విషయాలు పెద్దగా అవుతున్నాయని అన్నారు. కొత్త జిల్లాలు అయిన తర్వాత చాలా మందికి అధికారుల గురించి తెలియడం లేదని వాటి గురించి అధికారుల కు వివరించాలని అన్నారు. ప్రివిలైజ్ కమిటీ లో తీసుకునే నిర్ణయాలు ఖచ్చితంగా అమలు జరపాలని అన్నారు.