కర్ణాటక రాష్ట్రంలో ఇటీవల అనర్హతకు గురైన 17మంది ఎమ్మెల్యేలలో 15మంది ఎమ్మెల్యేలు కర్ణాటక ముఖ్యమంత్రి యడ్డీ సమక్షంలో బీజేపీలో చేరారు. అయితే అనర్హతకు గురైన పదిహేడు మంది ఎమ్మెల్యేలను ఎన్నికల్లో బరిలోకి దిగడానికి దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు అనుమతి ఇస్తూ తీర్పునిచ్చిన సంగతి విదితమే.
తాజాగా వీరిలో పదిహేను మంది ఎమ్మెల్యేలు కాషాయపు జెండాను యడ్యూరప్ప సమక్షంలో కప్పుకున్నారు. అయితే వచ్చే నెల డిసెంబర్ 5న జరగనున్న ఉప ఎన్నికల్లో వీళ్లంతా బీజేపీ తరపున బరిలోకి దిగనున్నారు.
మరోవైపు మిగిలిన రెండు స్థానాలపై ఉన్న పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో ఆ స్థానాల్లో ఎన్నికల కమిషన్ ఎన్నికలను నిర్వహించడం లేదు.