రఫెల్ విషయంపై స్పందించిన రాహుల్ భారత ప్రధాని నరేంద్ర మోదీ ని ‘చౌకీదార్ చోర్ హై’ అంటూ విమర్శించిన విషయం అందరికి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ నేత మీనాక్షి రాహుల్ పై కోర్టు ధిక్కరణ కేసు వేసారు. అయితే ఎట్టకేలకు ఈ కేసులో రాహుల్ కి ఊరట లభించింది. ఈ కేసుపై విచారణ చేపట్టిన సుప్రీమ్ కోర్ట్ రాహుల్ గాంధీని హెచ్చరించింది. ఎప్పుడైనా మాట్లాడినప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పింది. దీనికి స్పందించిన రాహుల్ కోర్టుకు క్షమాపణలు చెప్పారు. క్షమాపణలు కోర్టు స్వీకరించింది.