ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అధికారం చేపట్టిన ఐదు నెలల్లోనే ఏపీ దశ దిశ మార్చేందుకు పలు చర్యలు తీసుకుంటూనే మరోవైపు అనేక సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ యావత్తు దేశాన్ని తమవైపు తిప్పుకునే విధంగా పాలిస్తున్న సంగతి విదితమే.
తాజాగా ఏపీ రాష్ట్ర చరిత్రను మార్చే తొలి అడుగు వేయబోతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు సర్కారు బడుల్లో నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా స్కూళ్ల పరిస్థితులను తెలుసుకుని వాటిని పరిష్కరించడమే కాకుండా .. ప్రపంచంతో పోటి పడేలా పేద వర్గాల పిల్లలను తయారు చేస్తామని జగన్ అంటున్నారు.
రానున్న పదేళ్ళలో పేద పిల్లల తలరాతలను మార్చి ప్రపంచాన్నే మనవైపు చూసేలా నేడునాడు అనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని ముఖ్యమంత్రి జగన్మోహాన్ రెడ్డి అధికారులకు,ప్రజలకు పిలుపునిచ్చారు.