తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఈ క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దమ్మన్నపేట చెందిన అరుట్ల దేవవ్వ కిడ్నీ సంబంధిత సమస్యలతో తీవ్ర అనారోగ్యానికి గురైంది.
కిడ్నీలో రాళ్లతో బాధపడుతున్న ఆమె చికిత్సకు తగిన ఆర్థిక స్థోమత లేక ఇబ్బంది పడుతూ స్థానిక గ్రామ ఉపసర్పంచి అయిన అరుట్ల అంజిరెడ్డికి విషయం చెప్పుకుంది. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించారు.
కిడ్నీ వ్యాధి చికిత్స కోసం రూ లక్ష ఎల్వోసీను మంజూరు చేశారు మంత్రి కేటీ రామారావు. ఈ మేరకు దేవవ్వను యశోద దవాఖానలో చికిత్స పొందుతున్నది. ఎల్వోసీ చెక్ ను ఉపసర్పంచ్ అంజిరెడ్డి బాధితురాలి కు అందజేశారు. దీనిపై దేవవ్వ స్పందిస్తూ కష్టకాలంలో ఆర్థిక సాయమందించిన మంత్రి కేటీఆర్ కు జీవితాంతం రుణపడి ఉంటామనే ఆనందాన్ని వ్యక్తం చేసింది.