ప్రముఖ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు అస్వస్తతకు గురయ్యారు. నాలుగు రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న ఆయన బుధవారం బంజారాహిల్స్‌లోని కేర్ ఆసుపత్రిలో చేరారు. ఐసీయులో ఉంచి వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. జనరల్ చెకప్ నిమిత్తం కృష్ణంరాజు ఆసుపత్రికి వచ్చారని, ప్రతీనెలా ఇది మామూలే అని కృష్ణంరాజు వ్యక్తిగత సిబ్బంది చెబుతున్నారు. అయితే ఆయన నిమోనియోతో బాధపడుతున్నారని, అందుకు సంబంధించిన చికిత్సే ప్రస్తుతం జరుగుతోందని తెలుస్తోంది. రెబల్ స్టార్‌గా కృష్ణంరాజుకు మంచి పేరుంది. ఆయన చేసినవన్నీ యాక్షన్ సినిమాలే. సెంటిమెంట్ చిత్రాల్లోనూ నటించి పేరు తెచ్చుకున్నారు.