తెలంగాణ రాష్ట్ర బీజేపీకి చెందిన నేతలు పద్ధతి పాడు లేకుండా చిల్లరగా మాట్లాడుతున్నారని శాసనమండలిలో విప్ కర్నె ప్రభాకర్ అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను దేశవ్యాప్తంగా ఎలా అమలు చేయాలన్నదానిపై బీజేపీ కేంద్ర మంత్రులే తమతో టచ్‌లో ఉంటూ మాట్లాడుతున్నని అన్నారు. అలాంటిది ఇక్కడ బీజేపీకి చెందిన నేతలు దుర్మార్గంగా మాట్లాడుతున్నరని ఆయన అన్నారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలవగానే ఆ పార్టీ నేతలు ఎగిరెగిరి పడుతున్నారని విరుచుకుపడ్డారు.తమిళనాడులో బలం లేకపోయినా అధికారం కోసం కుట్రలు చేశారు. కర్నాటకలో బలం ఉన్న ప్రభుత్వాన్ని కుట్రలు చేసి దింపారు. గోవా, మహారాష్ట్రల్లోనూ బీజేపీ కుట్రలు చేస్తోందని ఆయన విమర్శించారు.