బాలల దినోత్సవం సందర్భంగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ చిత్రంలోంచి ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఇటీవలే ‘పప్పులాంటి అబ్బాయి’ పాటను విడుదల చేసి అలజడి రేపిన వర్మ ఇప్పుడు ఈ పోస్టర్ తో మరో వివాదం రేపేలా ఉన్నారు. సినిమా టైటిల్ తోనే వేడి పుట్టించిన వర్మ… టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మనవడు దేవాన్ష్ ను కూడా వదలట్లేదు. ఈ రోజు ఆయన విడుదల చేసిన ఈ పోస్టర్ లో దేవాన్ష్ పాత్ర ఉంది. చంద్రబాబు, నారా లోకేశ్ తో దేవాన్ష్ ఆడుకుంటున్నట్లు ఉన్న ఈ పోస్టర్ ను బాలల దినోత్సవం సందర్భంగా వర్మ విడుదల చేశారు.
Happy Children’s Day photo from KAMMA RAJYAMLO KADAPA REDDLU #KRKR pic.twitter.com/UfvVklviG0
— Ram Gopal Varma (@RGVzoomin) November 14, 2019