పైన కనిపించే వాచ్ ఎంతో తెలుసా..కేవలం రూ.226 కోట్లు మాత్రమే. ఇదేమిటి కామెడీ అనుకుంటున్నారు. కదండీ ఇది నిజంగా నిజమే ఒక వ్యక్తి ఈ వాచ్ ని అక్షరాలా 226కోట్లకు కొనుక్కున్నాడు. కాని ఆ మనిషి ఎవరూ, ఏం చేస్తాడు అనే విషయాలు తెలియనప్పటికీ దాన్ని తయారు చేసిన సంస్థ యొక్క వివరాలు మాత్రం బయటకు వచ్చాయి. ఈ వాచ్ యొక్క మోడల్ గ్రాండ్ మాస్టర్ చైమ్ 6300 ఎ – 010. దీనిని తయారు చేసింది పటేక్ ఫిలిప్. ఇది స్విట్జర్లాండ్ కు సంబంధించిన కంపెనీ. అయితే స్విట్జర్లాండ్ రాజధాని జెనీవాలో ఒక చారిటి సంబంధించిన వేలం లో ఈ రేటుకు అమ్ముడుపోయింది. ఇంత ధర వెచ్చించిమరీ కొన్నారంటే ఇది సూర్య సినిమా 24లొ ఉన్నట్టు భవిష్యత్తు ముందు వెనకకు చుసుకుండే ఛాన్స్ ఉంటుందా..? లేదా..? అనేది తెలియాలి.