ఏపీలో సర్కారు బడుల్లో ఒకటో తరగతి నుండి ఆరో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ను ప్రవేశ పెట్టాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి విదితమే.
ఈ రోజు బాలల దినోత్సవం సందర్భంగా ఇంగ్లీష్ నాడు నేడు అనే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ రోజు ప్రారంభించారు. అయితే ఏపీలో సర్కారు బడుల్లో ఇంగ్లీష్ మీడియం గురించి ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు.
ఆయన మాట్లాడుతూ” సర్కారు బడుల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం అనేది మంచి శుభపరిణామం. భవిష్యత్ లో ఇంగ్లీష్ అనేది చాలా ముఖ్యం. జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది.
దిన్ని వ్యతిరేకించేవాళ్లకు అసలు బుద్ధి ఉందా..?. ప్రతిదీ వ్యతిరేకించడం కాదు. కొన్నిటిని ఆహ్వానించాలి. ప్రతిపక్షాలంటే కీలక పాత్ర పోషించి.. ప్రజలకోసం పోరాడాలని”ఆయన సూచించారు.