తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని కూకట్పల్లి నియోజకవర్గంలో బాలానగర్,చిత్తారమ్మ బస్తీలో తెలంగాణ ప్రభుత్వం నూతనంగా నిర్మించిన మొత్తం 108డబుల్ బెడ్ రూం ఇండ్లను మంత్రులు కేటీ రామారావు,సీహెచ్ మల్లారెడ్డి లు ప్రారంభించారు. ఈ ఇండ్లను అర్హులకు అందజేశారు. ప్రభుత్వం వీటిని మొత్తం రూ. 9.34 కోట్ల వ్యయంతో నిర్మించింది. ఈ కార్యక్రమంలో నగర్ మేయర్ బొంతు రామ్మోహన్,స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, స్థానిక కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
