ఇండోర్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్ట్ లో బంగ్లాదేశ్ చేతులెత్తేసింది. కేవలం 150పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్స్ ధాటికి బ్యాట్స్ మెన్ లు తట్టుకోలేకపోయారు. ఉమేష్ యాదవ్ 2, షమీ 3, అశ్విన్ 2, ఇషాంత్ శర్మ 2 వికెట్లు పడగొట్టారు. టీ టైమ్ కే బంగ్లా చేతులెత్తేసింది. ఇలా అయితే మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగిసిపోతుంది అనడంలో సందేహం లేదు. ఇక బ్యాట్టింగ్ కు వచ్చే భారత్ జట్టు ఎలా రానిస్తుందో చూడాలి.
