ఏపీ తెలుగు యువత అధ్యక్షుడు ,టీడీపీ నేత దేవినేని అవినాశ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. అంతే కాదు గురువారం సాయంత్రం 4 గంటలకు సీఎం జగన్ సమక్షంలో దేవినేని అవినాష్ వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. తన రాజీనామా లేఖను ఆయన టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి పంపారు. ఆయనతో పాటు కడియాల బచ్చిబాబు కూడా ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ రోజు సాయంత్రం వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ సమక్షంలో ఆయన ఆ పార్టీలో చేరనున్నట్లు తెలిసింది. టీడీపీలో తనకు తగిన గుర్తింపు లభించడంలేదని అవినాశ్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వైసీపీలో చేరే విషయంపై ఇప్పటికే ఆయన తన అనుచరులతో చర్చించిన విషయం తెలిసిందే.తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన దేవినేని అవినాశ్. ఏపీ యువతలో మంచి పట్టున్న నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. గత ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గం నుంచి పోటీ చేసి వైసీపీ ఎమ్మెల్యే కోడాలి నాని చేతిలో ఓడిపోయారు.
