గురువారం ఇండోర్ వేదికగా ఇండియా,బంగ్లాదేశ్ మధ్య మొదటి టెస్ట్ ప్రారంభం అయింది. ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ తీసుకున్న బంగ్లా ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయింది. బంగ్లా ఓపెనర్స్ చేతులెత్తేశారు. టీ20 సిరీస్ కోల్పోయిన బంగ్లా ఇందులో ఐనా పట్టు బిగించి విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. కాని వారి ఆశలను నిరాశ చేసాడు అశ్విన్. అప్పటిలానే తన స్పిన్ మాయాజాలంతో బయపెట్టాడు. ఈ మ్యాచ్ లో ప్రస్తుతం అశ్విన్ రెండు వికెట్స్ పడగొట్టాడు. తద్వారా టెస్టుల్లో 250 వికెట్ల మార్క్ ని చేరుకున్నాడు.ఇండియా తరపున ఈ ఫీట్ సాధించిన మూడో ప్లేయర్ అశ్విన్ నే.