ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకు వైద్యులు వైద్య పరీక్షలు చేశారు. రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరత సమస్య పరిష్కారం కోసం నారా చంద్రబాబు నాయుడు ఉదయం పది గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు దీక్ష చేయనున్నారు. అందులో భాగంగా ఈ రోజు ఉదయం దీక్ష ప్రారంభించిన నారా చంద్రబాబు నాయుడుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో షుగర్,బీపీ లెవల్స్ సాధారణంగానే ఉన్నాయని తెలిపారు. చంద్రబాబు దీక్షకు మద్ధతుగా జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పాల్గొన్నారు.
